ఎక్కడికెళ్లినా ఇదే గోల.. పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పి

Jana sena Pawan Kalyan Fans over action at polavaram projectపవన్ కళ్యాణ్ రాజకీయాలలో సీరియస్ గా మారిన ఆయన అభిమానులలో మాత్రం అది కనిపించడం లేదు. ఇప్పటికి వారంతా ఆయనను ఒక సినిమా నటుడిగానే చూస్తున్నారు. నిన్న విశాఖలో ఆయన మాట్లాడుతుండగా ‘సీఎం సీఎం’ అంటూ అరవడంతో పవన్ కళ్యాణ్ వారిని వారించారు. మళ్ళి ఈరోజు పోలవరం దగ్గర కూడా సమయం సందర్భం లేకుండా అదే గోల.

జనసేనాని పోలవరం చేరుకున్నప్పట్నుంచీ ఆయన అభిమానులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ‘సీఎం సీఎం’ అంటూ గట్టిగా అరవడంతో ఒక దశలో పవన్‌ అసంతృప్తికి గురయ్యారు. ఇక్కడకు పనిమీద వచ్చానని, అలాంటి నినాదాలు చేయొద్దని వారించారు. అయినా అభిమానులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఇలాంటి బిహేవియర్ వాళ్ళ సామాన్య ప్రజలకు నెగటివ్ వెళ్లే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉండవొచ్చు. మరోవైపు ప్రాజెక్ట్ మీద ఉన్న అనుమానాలన్నీ పోవడానికి ఒక శ్వేతా పత్రం విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అప్పటికి కూడా కేంద్రం స్పందించకపోతే మీతో కలిసి నేను కూడా పోరాటం చేస్తా అని రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories