సినిమాలలో అంటే మేకప్ వేసుకుని ప్రేక్షకులకు కనపడతారు గానీ, రాజకీయ వేదికలపై మాత్రం తన సహజ సిద్ధమైన స్వరూపాన్ని చూపించడానికే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఇందుకు విరుద్ధంగా మొదటిసారి పొలిటికల్ ఫోటోషూట్ లో ‘జనసేన’ అధినేత పాల్గొన్నారు. అవును… రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా ఇలా పొలిటికల్ ఫోటోషూట్ లో పవన్ పాల్గొన్నారు.
రాజకీయ వేదికలపై ఎప్పుడూ కనిపించే ‘వైట్ అండ్ వైట్’ పైజామా కాస్ట్యూమ్స్ తోనే జరిగిన ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను ఈ నెల 14వ తేదీన ‘జనసేన’ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న నేపధ్యంలో… అభిమానులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పరచుకోవడానికి సహజంగానే ఫోటోలు అవసరమవుతుంటాయి.
అయితే ఇప్పటివరకు పవన్ సినిమాలలో నటించారు గనుక, ఫోటోలకు కొదవలేకుండా పోయింది. ఇక నుండి సినిమాలు ఉండవు గనుక, ఈ ఫోటోషూట్ కు పవన్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ ను ఇప్పటివరకు నాచురల్ గా ఆస్వాదించిన అభిమానులు, ఈ ఫోటోషూట్ లో పిక్స్ ను ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియాలంటే, మార్చి 14వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.



