‘భీమ్లా’ ఈవెంట్ లో ‘జనసేన’ డైలాగ్స్!

janasena dialogues at Bheemla nayak eventహైదరాబాద్ లో ఎంతో అట్టహాసంగా జరిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” వేదికపైన ‘జనసేన’ డైలాగ్స్ మోత మోగాయి. అయితే ఇవి పవన్ కల్యాణో, త్రివిక్రమ్ శ్రీనివాసో చెప్పలేదు, ఎవరి ఊహలకు అందని విధంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ సంయుక్త పలికింది.

మలయాళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంయుక్త స్టేజి ఎక్కింది మొదలు, మొత్తంగా తెలుగులో ప్రసంగించడం కొసమెరుపు. సంయుక్త తెలుగు ప్రసంగానికి ప్రేక్షకులే కాదు, స్టేజ్ ముందు కూర్చున్న టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు సైతం ముగ్ధులయ్యారు.

ADVERTISEMENT

ఇందులో కొసమెరుపు ఏమిటంటే… అప్పుడెప్పుడో ‘జనసేన’ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన “ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, నా చేతిలో దీపం లేదు, కానీ నా ధైర్యం మీ కవచం, నా ధైర్యమే నా ఆయుధం” అంటూ చెప్పిన డైలాగ్స్ సంయుక్త చక్కగా పలికింది.

ఊహించని ఈ పరిణామంతో ఫ్యాన్స్ కూడా సంయుక్త స్పీచ్ కు ఫిదా అయిపోయారు. సంయుక్త పలుకులతో ఈ ఈవెంట్ లో బండ్ల గణేష్ లేరన్న సంగతిని ఫ్యాన్స్ మరిచిపోయారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే ఇంత స్పష్టంగా తెలుగులో పలికిన సంయుక్త హైదరాబాద్ తన పర్మినెంట్ హోమ్ కావాలని ఆశిస్తున్నట్లుగా తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories