గెలవడం మీద కాదు మెజారిటీ మీద ధీమా..! పొత్తు మహిమా..?

Janasena Pawan Kalyan

గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పవన్ ఈసారి ఎలా అయిన అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఈసారి పోటీ చేయబోయే స్థానాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, ఎత్తులు – పొత్తులు లెక్కలు వేసుకుని మరి పిఠాపురం ను ఎంచుకున్నారు.

అయితే ఈసారి కూడా పవన్ ను ఎలా అయిన ఓడించాలని వైసీపీ తన సర్వశక్తులు వడ్డడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటించడానికి ఆ సీటును జనసేన పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసింది టీడీపీ.

ADVERTISEMENT

అయితే గత ఎన్నికలలో టీడీపీ – జనసేన విడివిడి గా పోటీ చేయడంతో దాన్ని ఫుల్ గా కాష్ చేసున్నారు వైసీపీ నాయకులు. దీనితో పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలో అటు వైసీపీ తో పాటుగా టీడీపీ కూడా బలమైన ముద్ర వేయడంతో పవన్ ఓటమి అనివార్యమయింది. కానీ ఈసారి టీడీపీ – జనసేన రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగడంతో అటు పవన్ బలం కు ఇటు టీడీపీ బలం తోడవడంతో ఈసారి పవన్ గెలుపు నల్లేరు మీద నడకే అంటూ పలు సర్వే రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి.

అయితే ఈరోజు తానూ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశమైన పవన్ పిఠాపురంలో తన విజయం తధ్యం..అలాగే ప్రత్యర్థి పై లక్ష మెజారిటీతో గెలుస్తా అంటూ ధీమా వ్యక్తం చేసారు. ఇన్నాళ్లుగా నేను గెలిచినా ఓడినా ప్రజల తరుపున ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ గెలుపు మీద అంత ధీమా గా ప్రకతాం కూడా చెయ్యని పవన్ ఇప్పుడు మెజారిటీ పై ఫుల్ క్లారిటీగా మాట్లాడం చూస్తుంటే ఇదంతా పొత్తు మహిమే అనాలేమో.

నన్ను ఓడించడానికి ఓటుకు 10 వేలు, కుటుంబానికి లక్ష ఇవ్వడానికి కూడా వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. డబ్బుతో ఈసారి నా గెలుపుని ఎవ్వరు అడ్డుకోలేరు అనేలా వైసీపీ కి కూడా చాలా ఘాటైన సమాధానమే చెప్పారు పవన్. ఏది ఏమైనా ఈసారి పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టడడం తథ్యం అంటూ చాలా బలంగా చెప్పడంతో పార్టీ శ్రేణులలో ఆత్మస్తైర్యాన్ని నిండుకుంది. ఇదే తీరుతో పవన్ ఎన్నికల ప్రచారం చేయగలిగితే కూటమితో పాటు జనసేన కూడా రాష్ట్రంలో బలపడడం ఖాయం.

అలాగే పిఠాపురంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జనసేన నుండి కాకినాడ ఎంపీ గా పోటీ చేయబోయే అభ్యర్థిని కూడా ప్రకటించారు. కాకినాడ జనసేన ఇంచార్జ్ గా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ గా పోటీ చేయబోతున్నారు అంటూ ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories