చిరంజీవి కోసం దిగుమతి చేస్తున్నారు!

Jasmine Sandlas-DSP-Khaidi No150Jasmine Sandlas-DSP-Khaidi No150మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ప్రతి చిన్న అంశానికి చిత్ర యూనిట్ ప్రాధాన్యత ఇస్తోంది. ఐటెం సాంగ్ హీరోయిన్ నుండి ఆ పాట పాడే బ్యూటీ వరకు… ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఈ సినిమాలో ఓ పాట పాడేందుకు బాలీవుడ్ లో పలు గీతాలు ఆలపించిన గాయని జాస్మిన్ సండ్లాస్ ను ఎంపిక చేసారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘దేవిశ్రీప్రసాద్ సంగీతంలో మొదటి తెలుగు పాటను రికార్డ్ చేసారని, ఆ సినిమా మరెవరిదో కాదు, మెగాస్టార్ దేనని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని’ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ‘కిక్, వన్ నైట్ స్టాండ్’ వంటి సినిమాలలో జాస్మిన్ పాడిన పాటలు శ్రోతలను మత్తులో ముంచెత్తాయి. తాజాగా పాడిన మెగాస్టార్ సినిమా తెలుగు పాట కూడా సంగీత ప్రియులకు ఆకట్టుకుంటుందని, సినిమాలో హైలైట్ అయ్యేలా నిలుస్తుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories