తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎలా మరణించింది? అనే విషయం ఇప్పటికీ పెద్ద మిస్టరీయే. దాదాపుగా 75 రోజుల పాటు జరిగిన నాటకీయ పరిణామాల నేపధ్యంలో ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇవి నివృత్తి అయ్యే అవకాశం లేదు గానీ, ‘అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అదే స్థాయిలో నాటకీయ పరిణామాలు ఏర్పడడం విశేషం.
పోయెస్ గార్డెన్ లో ‘అమ్మ’ ఆత్మ తిరుగుతోందంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అవి మీడియా వర్గాలకు కూడా పాకి ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి ఏకంగా ఓ వీడియో వైరల్ గా మారింది. అమ్మ ఆకారంలో గాల్లోంచి వస్తూ ఉన్న అపోలో ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశంలో ప్రత్యక్షమైందని ఈ వీడియో సారాంశం. ఇది ఖచ్చితంగా అమ్మ ఆత్మేనని చెప్పే విధంగా అమ్మ ధరించిన గ్రీన్ కలర్ శారీని చూపిస్తున్నారు.
అయితే వెబ్ వరల్డ్ లో ఇలాంటి వీడియో సృష్టికర్తలకు కొదవలేదన్న విషయం టెక్ ప్రియులకు తెలిసిందే. ఈ వీడియోను చూసి ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. శశికళపై రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందని కొందరు అంటుంటే, కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిందని మరికొందరు… ఇలా సోషల్ అండ్ వెబ్ మీడియాల వేదికగా ఈ వీడియో హల్చల్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి…!



