కమెడియన్ శ్రీనివాసరెడ్డి, పూర్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా ఈ నవంబర్ లో విడుదల కానుంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలోని రెండవ పాత్రను పరిచయం చేస్తూ మరో ఎంటర్టైన్మెంట్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రవీణ్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, రెండవ టీజర్ కూడా అదే బాటలో పయనిస్తోంది.
‘అడపా ప్రసాద్’గా కాకినాడ మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే సీనియర్ సూపరిండెంట్ గా పనిచేసే కృష్ణభగవాన్ పాత్ర తూర్పు గోదావరి జిల్లాలోని ఎటకారాన్ని గుర్తుకు తెస్తోంది. తన చుట్టూ పక్కన ఉండే వారు నవ్వుతూ ఉంటే తనకు ఎంతో ఇష్టమో అని పరిచయమైన ఈ పాత్ర స్వభావం ఈ టీజర్ మొత్తం చూసాకా గానీ అర్ధం కాదు… ఆ ఎటకారం ఏమిటన్నది..! మొదటి టీజర్ మాదిరే కాస్త స్లోగా ఉన్నప్పటికీ వినోదానికి లోటు లేకుండా ఉండడంతో ఓ లుక్ వేయడానికి ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బంది కలుగకపోవచ్చు.



