టీడీపీ టిక్కెట్టుకు కర్ణాటక సీఎం రికమండేషన్

JDS Kumaraswamy recommendation for TDP tirupati seatతిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ ఏకంగా కర్ణాటక సీఎంను రంగంలోకి దించుతున్నట్లు భోగట్టా. జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడ, కన్నడ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరుపతి అసెంబ్లీ టికెట్‌ రమణకు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి టికెట్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆవిడ కాకుండా మరో ముగ్గురు ఆశావహులు కూడా టిక్కెట్టు కోసం పడిగాపులు కాస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఈనెల 13, 14 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ADVERTISEMENT

ఈ సంధర్భంగా చంద్రబాబు దగ్గర మాట తీసుకోవాలని రమణ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చంద్రబాబు కుమార స్వామి ప్రతిపాదన కాదు అనరని కొందరు నేతలు అనుకుంటున్నారు. అయితే మరొక వర్గం మాత్రం చంద్రబాబు ఇటువంటి విషయాల్లో అంత తేలికగా నిర్ణయాలు తీసుకోరని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories