జోగి వారి ప్రమాణాలు…వైసీపీ కి ప్రమాదాలే..!

Jogi Ramesh responds to fake liquor case allegations and challenges government

నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు, విమర్శలు ఎదురవ్వడంతో విచారణ జరిపిన అధికారులు అందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన జోగి తన పై బాబు, లోకేష్ రాజకీయ కక్ష్య సాధింపులకు దిగుతున్నారని, కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ అందులో భాగంగానే తన పై ఈ నకిలీ మద్యం కేసు మోపారంటూ నానా హంగామా చేస్తున్నారు.

ADVERTISEMENT

మొన్న కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి వెళ్లి హారతి వెలిగించి సత్య ప్రమాణాలు చేసిన జోగి ఇక ఇప్పుడు ‘నారా వారి సారా’ అంటూ నినాదాలు చేస్తూ నేను లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, సీబీఐ విచారణకు రెడీ, నార్కో టెస్ట్ కైనా సై అంటూ కూటమి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు.

ఇక పనిలో పనిగా తన నిర్దోషత్వాన్ని తెలపడానికి దేవుడిని సైతం సాక్షిగా చూపిస్తూ తిరుమల వెంకన్న దగ్గర ప్రమాణానికైనా సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే జోగి చేస్తున్న ఈ ప్రమాణాల హడావుడి చూస్తుంటే దొరికిపోయిన దొంగ తన దొంగతాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే ఆరాటం మాదిరి కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అవినీతి ఆరోపణలకు దేవుని ఎదుట చేసే సత్య ప్రమాణాలను న్యాయస్థానాలు ప్రామాణికంగా తీసుకుంటాయా.? వాటిని జోగి తరుపున సాక్ష్యాలుగా పరిగణిస్తాయా.? ఇలా అవినీతి ఆరోపణలు, అక్రమాల విమర్శలు ఎదుర్కుంటున్న ప్రతి ఒక్కరు దేవుని ఎదుట ప్రమాణాలు చేసి తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవచ్చా.?

భారత రాజ్యంగంలో ఆ వెసులుబాటు ఉందా.? లేక వైసీపీ చేసుకున్న రాజ్యంగంలో ఈ ప్రమాణాల కాన్సెప్ట్ నిజాయితీకి ప్రామాణికంగా నిలుస్తున్నాయా.? అలా అయితే జగన్ మీద ఉన్న పదుల సంఖ్యలో అవినీతి కేసుల గురించి కూడా జగన్ దేవుని ఎదురు ప్రమాణం చేసి తన కేసులను మాఫీ చేసుకుంటారా.?

రాజకీయాలలో నాయకుల మీద అవినీతి ఆరోపణలు రావడం సర్వ సహజం. అటువంటి విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి, అంతే కానీ నేను నిర్దోషిని, నన్ను నమ్మండి, నేను దేవుని ముందు ప్రమాణం చేశాను, ఏ టెస్ట్ కైనా సిద్ధం అంటూ సవాల్ చేశాను అని తేలుకుట్టిన దొంగ మాదిరి కుప్పిగంతులు వేస్తె అది వైసీపీ నే ఇరుకున పెడుతుంది, పార్టీని ప్రమాదంలోకి నెడుతుంది.

ADVERTISEMENT
Latest Stories