రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా వైసీపీ నాయకులు దైవంతో కూడా రాజకీయమే ఆడుతున్నారు. తన నిర్దోషత్వన్ని నిరూపించుకోవడానికి న్యాయస్థానాలను వదిలి దేవస్థానాలు ఎంచుకుంటున్నారు వైసీపీ నేతలు.
నకిలీ మద్యం కుంభకోణం అంశంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నేడు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఎదుట హారతి వెలిగించి తన పై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదంటూ సత్య ప్రమాణం చేసారు.
అయితే రాజకీయ నాయకులు చేసే సత్య ప్రమాణాలలో అసలు సత్యం అనేది ఉంటుందా.? ఒక పక్క ఈ నకిలీ మద్యం కేసులో ఏ -1 అరెస్టయిన అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్టయ్యి కీలక ఆధారాలను అధికారులకు అందించారు, అలాగే ఆయన కు జోగి రమేష్ కు మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ కూడా మీడియాలో ప్రత్యక్షమయింది.
అలాగే జోగి రమేష్ తో సదరు నిందితుడు చనువుగా కనిపించిన ఫోటోలు కూడా తెరమీదకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి అమ్మవారి ఎదుట హారతి వెలిగించి కుటుంబ సమేతంగా సత్య ప్రమాణాలు చేసి తన శీల పరీక్షను నిరూపించుకోదలచారా.?
తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ తన పై కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ, తనను ఎదుర్కోవడానికి రాజకీయంగా ముందుకు రావాలే కానీ ఇలా తప్పుడు కేసులు మోపి కక్ష్య సాధింపులకు దిగకూడదు అంటూ కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు జోగి.
అలాగే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తానూ లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ సత్య ప్రమాణాలు న్యాయస్థానాన్ని ప్రభావితం చెయ్యగలుగుతాయా.? అధికారుల దగ్గర జోగి రమేష్ ప్రమేయం పై సాక్ష్యాధారాలు ఉంటె ఈ ప్రమాణాలు వాటిని బూడిద చెయ్యగలుగుతాయా.?
ఈ ప్రమాణాలతో జోగి ఏ చెప్పాలనుకుంటున్నారు.? ఎం నిరూపించుకోదలిచారు.? తానూ నిర్దోషిని, తనకు నకిలీ మద్యానికి ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించుకోవడానికి ఈ దైవ ప్రమాణాలు ప్రామాణికం అవుతాయా.?




