జూనియర్ ఎన్టీఆర్… 3 లక్షల నుండి 30 కోట్ల దిశగా..!

Nonsense nominations leave fans furious!‘యంగ్ టైగర్’ జూనియన్ ఎన్టీఆర్ చిత్ర రంగంలోకి అడుగుపెట్టి సరిగ్గా పదిహేనేళ్లు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ మే 25, 2001వ తేదీన విడుదలైన నాటినుండి ఇప్పటివరకు 25 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు… అభిమానుల కోసం…

ADVERTISEMENT

ఇష్టమైన ఆట – క్రికెట్, బ్యాటింగ్ బహు ప్రియం
ఇష్టమైన్ వంట – అమ్మ వండి పెట్టే రొయ్యల బిర్యానీ
ఇష్టమైన హీరో – ఎన్టీఆర్ (తాత)
ఇష్టమైన హీరోయిన్ – శ్రీదేవి
ఇష్టమైన సినిమా – దానవీరశూరకర్ణ
ఇష్టమైన నెంబర్ – 9 (లక్కీ ఫిగర్)
ఇష్టమైన పాట – ‘మాతృదేవోభవ’లో ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…’

ఇతర పెద్ద హీరోల మాదిరి పుస్తకాలను ఎక్కువగా చదవని జూనియర్ ఎన్టీఆర్, వినడంపై ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంటారు. తను హీరోగా నటించిన మొదటి చిత్రం పారితోషికం 3 లక్షలను తీసుకువచ్చి తన తల్లి షాలిని చేతుల్లో పెట్టారట జూనియర్ ఎన్టీఆర్. అలా 3 లక్షల నుండి ప్రారంభించిన సినీ ప్రయాణం ప్రస్తుతం 30 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ‘టెంపర్’ సినిమా నుండి జూనియర్ ఎన్టీఆర్ లో సరికొత్త యాంగిల్ కనపడుతుండడం అభిమానులకు పండుగ చేసుకునే విషయం. ఒకప్పుడు కొత్తదనానికి పెద్ద పీట వేయని జూనియర్, ప్రస్తుతం కొత్తదనం లేకుండా సినిమాలు చేయకపోవడం తెలుగు సినిమాకు కూడా మంచి పరిణామం.

ADVERTISEMENT
Latest Stories