ఛాన్స్ తీసుకోవడం లేదు… హ్యాట్రిక్ కోసం యంగ్ టైగర్..!

Jr NTR - Devi Sri Prasad Combinationమణిశర్మ వదిలేసిన స్థానాన్ని విజయవంతంగా ఒడిసి పట్టుకోవడంలో దేవిశ్రీప్రసాద్ సక్సెస్ సాధించారు. అప్పటినుండి ప్రతిష్టాత్మక సినిమాలను దేవిశ్రీనే ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నారు. దేవికి కుదరని పక్షంలోనే అలాంటి అవకాశాలు మరో సంగీత దర్శకుడికి చేరుతున్నాయి గానీ, దర్శక నిర్మాతల పరంగా గానీ, హీరోల పరంగా గానీ, అందరికీ దేవి దగ్గరయ్యాడు. అలాంటి దేవి మరోసారి తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొట్టిన దేవి, హ్యాట్రిక్ కోసం మళ్ళీ వీరిద్దరూ జోడి కడుతున్నారు. బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న “జై లవకుశ” సినిమా కోసం అనేక మంది సంగీత దర్శకులను పరిశీలించిన మీదట, చివరికి దేవినే ఆ అవకాశం వరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories