నల్గొండ జిల్లా అంటే భయపడే స్థితికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం వచ్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా మూడు యాక్సిడెంట్ లు అదే జిల్లాలో చోటు చేసుకోవడం, అందులో ఇద్దరు ప్రాణాలు విడవడం అనేది జూనియర్ కుటుంబాన్ని తీవ్రంగా కృంగదీస్తోంది. విశేషం ఏమిటంటే… 2009లో అత్యంత భారీ యాక్సిడెంట్ గురైన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఈ జిల్లా నుండి ప్రాణాలతో బయటపడ్డారు.
[m9ad]
2009లో మార్చి 26వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ తర్వాత, 2014లో డిసెంబర్ 6వ తేదీన నందమూరి జానకిరామ్ అదే నల్గొండ జిల్లాలో తుది శ్వాసను విడిచారు. ఇప్పుడు తాజాగా 2018 ఆగష్టు 29వ తేదీన నందమూరి హరికృష్ణను నల్గొండ జిల్లానే బలితీసుకుందంటే… నల్గొండ జిల్లాకు, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా ఆలోచనలు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు జరిగిన యాక్సిడెంట్ కు, జానకిరామ్ కు జరిగిన యాక్సిడెంట్ కు అయిదేళ్ళ గ్యాప్ ఉండగా, జానకిరామ్ – హరికృష్ణల యాక్సిడెంట్ కు నాలుగేళ్ల విరామం ఉంది. విధి వైపరీత్యం అనుకోవాలో, రోడ్డు ప్రమాదాల నుండి ప్రజలు గుణపాఠం నేర్చుకోవట్లేదని అనుకోవాలో గానీ, నల్గొండ జిల్లా అంటే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి “డేంజర్ జోన్” గా మారిపోయింది.



