వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజా ఏపీ రాజకీయ వివాదాల మీద స్పందించారు. ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ విధానాలను, ప్రశ్న రావణ్ బూతు ప్రశ్నలను తప్పుబడుతూ వారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధించారు.
రావణ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు.? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు.? వీరు ఏ సంస్కృతికి వారసులు.? వీరి పూర్వికులు ఎవరు.? వీరి మూలాలు ఎక్కడివి.? హిందూ సంస్కృతీ సంప్రదాయాల మీద వీరు చేస్తున్న ప్రకటనలు ఆమోదయోగ్యమైనవి కాదు.
ఇటుంటి వారి పై ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి కేసులు పెట్టి అరెస్టులు చెయ్యాలి. అవసరమైతే చట్టాలలో మార్పులు తీసుకువచ్చయిన వీరిని కట్టడి చెయ్యాలి. దేశంలో మతాల మధ్య చిచ్చులు పెట్టె ఇటువంటి వారు ముమ్మాటికి శిక్షార్హులే అంటూ తన అభిప్రాయాన్ని కుండబడ్దలు కొట్టారు.
అలాగే ఇటువంటి వారిని వైసీపీ నేరుగా సమర్దించడం, వారి విషయాలను హై లైట్ చేయడం, వారికీ మద్దతు పలకడం అంటే వైసీపీ నేరుగా హింతుత్వం మీద దాడి చేస్తున్నట్టే అవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో, దేశంలో మత మార్పిడుల పేరిట మతాలు మార్చుకున్న అనేకమంది వారి పేర్ల చివర ఉండే కులం తోకను కత్తిరించక పోవడం పై కూడా సాయి ప్రశ్నలు సాగాయి.
ఓసి లలో ప్రధానంగా ఉండే రెండు అధికార కులాల నుంచి కన్వర్ట్ అయిన కొన్ని కుటుంబాలు మతమార్పిడి చేసుకున్నప్పటికీ వారి పేర్ల చివర ఉండే కులం తోకను వదులుకోవడం లేదని, ఒకపక్క కులం పేరుతో మరోపక్క మతం పేరుతో ఆర్థికంగా, రాజకీయంగా లబ్ది పొందుతున్నారంటూ వాపోయారు సాయి రెడ్డి.
అయితే సాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీలోని ఒక రాజకీయ పార్టీని తాకాయా, ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేసాయి అంటూ సోషల్ మీడియాలో సాయి రెడ్డి పోస్ట్ పై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.




