ఫ్యాన్స్ మధ్య కొట్లాట… పవన్ ఫ్యాన్ మరణం..!

Vinod Royalనిజమే… సినిమా హీరోపై ఉన్న అభిమానం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. మా హీరో గొప్పవాడంటే, కాదు మా హీరో గొప్పవాడంటూ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణం పోయింది. కర్ణాటకలోని కోలార్ లో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత వపర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ ప్రాణాలు వదిలాడు.

పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన తిరుపతికి చెందిన వినోద్ రాయల్ అనే యువకుడు ‘జనసేన’కు సంబంధించి నగరంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఆ క్రమంలోనే ఆదివారం నాడు కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వినోద్ హాజరయ్యాడు. కార్యక్రమం తర్వాత స్నేహితులతో వినోద్ కూర్చోగా… టాలీవుడ్ కే చెందిన జూనియర్ ఎన్టీఆర్ హీరో అభిమాని, వినోద్ మధ్య చర్చ జరిగింది.

ADVERTISEMENT

తమ హీరో గొప్ప అంటే, కాదు తమ హీరో గొప్ప అంటూ వారిద్దిరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన జూనియర్ అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను అతడి మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినోద్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చేసేది లేక సోమవారం నాడు తిరుపతికి వినోద్ మృతదేహాన్ని తీసుకురాగా… అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.

ADVERTISEMENT
Latest Stories