ప్రస్తుతం ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ఎన్నడూ లేనంత ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఈ నెల 21వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. తమ అభిమాన హీరో నటిస్తున్న “జై లవకుశ” సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడంతో, ఇక విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో విడుదల తేదీతో కూడిన పోస్టర్లను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తోంది. ఈ పోస్టర్లలో ఎక్కువగా ‘జై’ పాత్రకు సంబంధించినవి కావడంతో, అవి ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా మారాయి.
‘రావణాసురుడు’ పది తలల మాదిరి తారక్ పది తలలతో విడుదలైన పోస్టర్ అభిమానులకు పసందైన విందును అందించగా, తాజాగా ‘జై’ పాత్రకు సంబంధించే మరో పోస్టర్ ను విడుదల చేసారు. తారక్ నడుస్తూ వస్తుండగా, వెనుక సాయికుమార్ ఉన్న పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో కనపడుతోంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్న విధానం పోస్టర్లలోనే ఈ రేంజ్ లో ఉంటే, రేపు సిల్వర్ స్క్రీన్ పై దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అసలే ఎన్టీఆర్ బలం… మాస్ అభిమానగణం… వారికి హద్దులు ఉండవని చెప్పే విధంగా పోస్టర్లు కేకలు పెట్టిస్తున్నాయి.


