‘జూనియర్ ఎన్టీఆర్’ సినిమాపై లేటెస్ట్ ‘రూమర్’

jr-ntr-latest-movie-rumorపెద్ద హీరోల సినిమా సంగతులు ఫ్యాన్స్ కు ఎప్పుడు కిక్ ఇస్తుంటాయి. ఆ కోవలోనే ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ‘అతిలోక సుందరి’ శ్రీదేవి ఓ కీలకపాత్ర పోషిస్తోందన్న వార్త, బుడ్డోడు అభిమానులను మాంచి జోష్ లోకి నెట్టింది. సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జూనియర్ తదుపరి సినిమా నిర్మాణం కావడంతో, ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్ర యూనిట్, భారీ కాస్టింగ్ ను ఎంపిక చేస్తోందని, అందులో భాగంగా శ్రీదేవితో సంప్రదింపులు జరిపి, ఓకే చేయించారనేది ఈ వార్తల సారాంశం.

అయితే ఇదంతా కేవలం ఒట్టి పుకారేనని తాజాగా తేలిపోయింది. బాబీ దర్శకత్వం వహించబోయే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి లేదన్న సమాచారం ట్రేడ్ వర్గాల నుండి లభించింది. ‘అతిలోక సుందరి’పై స్పష్టత రావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. క్రేజీ కాంభినేషన్ విషయం ఎలా ఉన్నా… ఒకప్పటి ‘అతిలోకసుందరి’ ఇప్పుడు ఆశించినంత లుక్ లో కనిపించకపోవడంతో, శ్రీదేవి ఎంపికపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఏదొక రూపేణా బుడ్డోడు సినిమా వార్తల్లో నిలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories