త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా మేకోవర్ కానున్న విషయం తెలిసిందే. ఇటీవలే కొత్త లుక్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి, ‘బృందావనం’లోని ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చిన సంగతి నెటిజన్లకు తెలిసిందే. అయితే ఇంత తక్కువ సమయంలో ఆ స్థాయిలో మార్పుకు ఎన్టీఆర్ ఎలా కష్టపడ్డారు అన్న దానికి నిదర్శనమే ఈ లేటెస్ట్ ఫోటో.
ADVERTISEMENT
సైడ్ యాంగిల్ లో ఉన్న ఈ స్టిల్ లో ఎన్టీఆర్ ఏ విధంగా తగ్గాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కండలు తిరిగిన చేతులతో ‘టెంపర్’లోని బీచ్ సాంగ్ ను గుర్తు చేస్తోన్న తారక్ కష్టాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంకేముంది… ఫ్యాన్స్ హంగామాతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ హార్డ్ వర్క్ స్టిల్ చూస్తూ… ‘బుడ్డోడు మామూలోడు కాదు’ అంటూ అభిమానులు మురిసిపోతూ తెగ పొగిడేస్తున్నారు..!
ADVERTISEMENT



