యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం గత వేసవిలో ప్రారంభం కావాల్సి ఉంది, అయితే ఆ సినిమా కరోనా మహమ్మారి కారణంగా అలాగే ఆర్ఆర్ఆర్ కారణంగా ఆలస్యం అయింది. ఈ చిత్రం చివరకు ఒక సంవత్సరం ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్తోంది. నిర్మాత ఎనాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం యొక్క అప్డేట్ ని వెల్లడించారు.
“ఈ చిత్రం ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో సెట్స్ మీదకు వెళ్తుంది” అని నాగవంశీ వెల్లడించారు. అయితే ఈ చిత్రం యొక్క మిగతా నటీనటుల గురించి… సాంకేతిక నిపుణుల గురించి అడిగితే మాత్రం… హీరో దర్శకుడు తప్ప ఎవరు కంఫర్మ్ కాలేదని చెప్పడం విశేషం. దానితో చిత్రం గురించి సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.
చివరిసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు దర్శకత్వం వహించినప్పుడు, అరవింద సమేత ఆ స్టార్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయైన ముప్పైవ చిత్రం. మే నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అవుతుంది. ఎన్టీఆర్ భాగాలు ముందే పూర్తయితే ముందే ఈ సినిమాకు షిఫ్ట్ అవుతాడు హీరో.
ఒకసారి షూటింగ్ మొదలుపెట్టాకా… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లకు విరామం తప్ప ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం నాన్ స్టాప్ షూట్ చేస్తాడని అంటున్నారు. మొత్తం షూటింగ్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. అలాగే 2022 ఏప్రిల్ 29 న చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హరిక హాసిన్ మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌లలో సంయుక్తంగా నిర్మించనున్నారు.





