రిలీజ్ తర్వాత ‘జూనియర్’ స్పందన ఇది!

Jai Lava Kusa US Premier Shows - Bookings Open All Over!తాను చేసిన “జై లవకుశ” సినిమాకు ప్రేక్షకుల నుండి లభించిన ప్రశంసల పట్ల జూనియర్ ఎన్టీఆర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు. ఒక నటుడిగా ఇంతకంటే ఏం కావాలి… జై లవకుశ’ టీం తరపు నుండి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను…. అంటూ విడుదలైన ఒక రోజు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ లో ఎక్కడా కలెక్షన్స్ ప్రస్తావన లేకుండా కేవలం నటుడిగానే వ్యాఖ్యానించడంతో, ఈ ట్వీట్ వెనుక ఆంతర్యం అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ గురించి పూర్తిగా మాట్లాడాలంటే, ఈ వీకెండ్ ముగియాల్సిందే. అప్పుడు గానీ ఒక అంచనాకు రాని పరిస్థితి. సాధారణ ప్రేక్షకుల టాక్ ఎలా ఉన్నా, అభిమానులకు మాత్రం మూడు పాత్రలతో ‘ఐ ఫీస్ట్’గా నిలిచాడు తారక్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి రాజమౌళి సైతం, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడారు తప్ప, బాక్సాఫీస్ రేంజ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. జూనియర్ చెప్పిందయితే అక్షర సత్యం… ఏ నటుడికైనా ఇంతకుమించి ఏం కావాలి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories