ఎన్టీఆర్… మరీ ఓవర్ గా చేస్తున్నారేమో…!

Jr NTR working hard in Gym‘జై లవకుశ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు గానీ, కమర్షియల్ గా కావాల్సిన సక్సెస్ ను దక్కించుకోలేని జూనియర్ ఎన్టీఆర్, ఈ సారి ఆ లోటును పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్రివిక్రమ్ సూచనల మేరకు జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ సందడి చేస్తున్నాయి.

‘తన తదుపరి సినిమా కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ ఎంతగా కష్టపడుతున్నారో’ అనిపించే విధంగా ఉన్న ఈ స్టిల్స్ అభిమానులకు గర్వకారణంగా ఉంటున్నాయి. కానీ ఇదే సమయంలో…. మరీ ఓవర్ గా కష్టపడుతున్నారేమో అన్న టాక్ కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఇంత కష్టాన్ని చూసి తట్టుకోలేము అంటూ స్పందించడం అభిమానుల వంతవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories