“జురాసిక్ వరల్డ్” సినిమాలకు ఉన్న ప్రత్యేకత సినీ ప్రియులకు విదితమే. ఆ సిరీస్ లో భాగంగా తాజాగా “ఫాలెన్ కింగ్ డం” పేరుతో మరో మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతోంది. చాలా కాలం తర్వాత “జురాసిక్ వరల్డ్” సిరీస్ లో ఓ సినిమా రూపుదిద్దుకోవడంతో, దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2018 జూన్ 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. దాదాపుగా రెండున్నర్ర నిముషాల పాటు సాగిన ఈ ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం చెప్పేయడం విశేషం. కధ ఎలా ప్రారంభమవుతుందో మొదలుకుని, క్లైమాక్స్ ఎలా ముగుస్తుందో అన్న విషయాన్ని స్పష్టం చేసేయడంతో, కధపై పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది.
అంతకుముందు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించిన అంశాలనే మళ్ళీ మేళవించి, అధునాతనంగా చూపించే ప్రయత్నం చేసారు తప్ప, ఇతరత్రా మార్పులు అయితే ఏం కనపడట్లేదు. అయితే హాలీవుడ్ యాక్షన్ మూవీలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు మాత్రం కన్నులవిందు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
Watch the @JurassicWorld #FallenKingdom trailer now! Life finds a way June 22. pic.twitter.com/UDU0MFIsIb
— Jurassic World (@JurassicWorld) December 8, 2017





