ఈ టీజర్ ను చిరంజీవి ఎలా రిలీజ్ చేసారో?

Juvva-Movie-Teaser--Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి ఏంటి? ఆయన రేంజ్ ఏంటి? ఆయన రిలీజ్ చేసిన ఈ టీజర్ ఏంటి? అన్న అనుమానం మెగాస్టార్ రిలీజ్ చేసిన “జువ్వ” టీజర్ చూసిన తర్వాత కలుగక మానదు. ప్రేక్షకులకు పరిచయం లేని రంజిత్, పాలక్ అనే వ్యక్తులు హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ సినిమా టీజర్ లో హీరో గారి యాక్షన్ చూడాలంటే రెండు కళ్ళు చాలవని చెప్పాలి. మూస ధోరణిలో సాగిన ఇలాంటి టీజర్లను రిలీజ్ చేసి, మెగాస్టార్ తన స్థాయిని దిగజార్చుకోవద్దు అనేది మెగా ఫ్యాన్స్ మాట.

ఫోటోలకు ఫోజులిచ్చే విధంగా హీరో చూపించిన అభినయం, ఎక్స్ ప్రెషన్స్ అనేవి పక్కన పెడితే, ప్రొడక్షన్ లో గానీ, డైరెక్షన్ డిపార్టుమెంటులో గానీ ఎక్కడా నాణ్యత కనిపించదు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం అనేది మంచి విషయమే అయినా, మరి ఇలాంటి నాణ్యతాలోపమైన సినిమాలను ప్రోత్సహించడం చిరు స్థాయికి తగినది కాదని పేర్కొనాలి. చిరు టీజర్ రిలీజ్ అన్న విషయం పక్కన పెడితే… ఈ సినిమా సంగీతం టైటిల్ కార్డ్ లో ఎం.ఎం.కీరవాణి పేరు కనిపించడం మరో ట్విస్ట్.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories