సూపర్ స్టార్ సినిమా ‘టైటిల్’ వివాదం!

Kaala Controversyఅగ్ర హీరోల సినిమాలను, వివాదాలను వేరు చేసి చూడలేం అన్నంతగా సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి పెద్ద సినిమా కూడా ఏదొక రూపేణా వివాదాస్పదం అవుతున్న వైనం దర్శకనిర్మాతలను కంగారు పెట్టిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ “కాలా” సినిమాకు కూడా టైటిల్ వివాదం చుట్టుముట్టింది. “కాలా” సినిమా కధ, టైటిల్ తనవేనంటూ సహాయ దర్శకుడు రాజశేఖరన్ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది.

ADVERTISEMENT

“కాలా కరికాలన్” అనే పేరుతో తాను పదేళ్ళ క్రితమే ఓ కధను రాసుకున్నానని, అందులో రజనీని హీరోగా తీసుకోవాలని తాను భావించానని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించగా, చిత్ర హీరో రజనీ, నిర్మాత ధనుష్ మరియు దర్శకుడు రంజిత్, దక్షిణ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘంకు నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 12వ తేదీ లోపున వివరణ ఇవ్వాల్సిందిగా స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్ లో చెన్నై కోర్టు రాజశేఖరన్ ఆశ్రయించగా, ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories