‘ఎంఎల్ఏ’ బ్యూటీ ఖాతాలో కొత్త రికార్డ్!

Kajal Aggarwal Facebook followers 24k Likesసోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో కాజల్ అగ్వరాల్ కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ స్థానాన్ని చేరుకోవడమే కాక, ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో సైతం నటించిన కాజల్ అగ్వరాల్ చేతిలో ప్రస్తుతం తెలుగులో “ఎంఎల్ఏ” సినిమా ఉంది. తన కెరీర్ లో తొలి సినిమా హీరో కళ్యాణ్ రామ్ తో జోడి కడుతోన్న ఈ సినిమా కాకుండా, తమిళంలో “క్వీన్” రీమేక్ లో కూడా దర్శనమిస్తోంది.

ADVERTISEMENT

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఈ ముద్దుగుమ్మ ఫేస్ బుక్ ఖాతాలో అభిమానుల సంఖ్య ఏకంగా ఏకంగా 24 మిలియన్స్ కు చేరుకుంది. ఇందుకు గానూ అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ ఓ పోస్టింగ్ ను చేసింది కాజల్. దక్షిణాది హీరోయిన్లలో ఫేస్ బుక్ లో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కావడం అసలు విశేషం. సౌత్ లో ఎంతమంది తారామణులు వచ్చినా… కాజల్ స్థానం ప్రత్యేకమైనదని ఫ్యాన్స్ చెప్పకనే చెప్తున్నారు కదా..!

ADVERTISEMENT
Latest Stories