నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర దర్శకత్వంలో తెరక్కుతోన్న “ఎంఎల్ఏ” సినిమాకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ విడుదలైంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు స్పూన్ తో ఫీడ్ చేస్తోన్న కళ్యాణ్ రామ్ పిక్ వీక్షకులను ఆకర్షిస్తోంది. రొమాంటిక్ ఫీల్ ఇస్తోన్న ఈ పోస్టర్ లో… కాజల్ అగర్వాల్ ప్రదర్శించిన హావభావాలు యువ హృదయాలను కొల్లగుడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా మార్చి 23వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటివరకు ప్రారంభం పెద్దగా కాలేదు. ఇటీవల కళ్యాణ్ రామ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకున్నప్పటికీ, సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా లేదు. కానీ ఈ రొమాంటిక్ పోస్టర్ మాత్రం కావల్సినంత ఎనర్జీని పంచింది. ఎంతైనా ‘చందమామ’ కదా… ఆకర్షించకుండా ఎలా ఉండగలదు..!
ADVERTISEMENT
ADVERTISEMENT



