బ్లాక్ డ్రెస్ లో ‘చందమామ’ మెరిసిపోతోందే..!

Kajal aggarwal new lookబొద్దుగుమ్మ అవతారం నుండి బాగా సన్నబడిన ‘చందమామ’ కాజల్ లుక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం’ సినిమాలు ఫెయిల్ అయినా గానీ, ఆ సినిమాలలో కాజల్ ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచలేదు. ఆ ప్రభావంతోనే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని కూడా సంపాదించింది కాజల్.

ADVERTISEMENT

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న కాజల్, తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో మిలమిలా మెరిసిపోతున్న ఈ ‘చందమామ’ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ స్టైలిష్ కాస్ట్యూమ్ కాజల్ అందాలకు మరింత వన్నె తెచ్చే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేవలం ఫోటోలలోనే ఈ స్థాయి సౌందర్యాన్ని ప్రదర్శిస్తే… రేపు మెగాస్టార్ మూవీలో వెండితెరపై కాజల్ ఏ రేంజ్ లో హొయలు ఒలికిస్తుందో..?

ADVERTISEMENT
Latest Stories