‘కాంప్రమైజ్’పై కాజల్ షాకింగ్ స్టేట్మెంట్!

kajal-aggarwal-statement on compramiseసినిమా ఇండస్ట్రీలో తాము ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నామో ఇటీవల కొందరు నటీమణులు చెప్పుకొచ్చి సంచలనం సృష్టించారు. తాజాగా ఇదే బాటలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోన్న ‘చందమామ’ కాజల్ అగర్వాల్ కూడా తన అనుభవాన్ని బయటపెట్టింది. సినీ పరిశ్రమలో ఒక్క ఛాన్స్ కోసం మీరెప్పుడైనా ‘కాంప్రమైజ్’ అయ్యారా? మీరలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ… ‘నిజానికి అలాంటి సందర్భం ఎదురుకాకపోయినా దాని గురించి విన్నానని’ పేర్కొంది.

ADVERTISEMENT

అవకాశాల కోసం తామెలా రాజీపడాల్సి వచ్చిందో కొందరు హీరోయిన్లు చెప్పారని, అది చాలా బాధాకరమని, అయితే తన వరకు పాటల్లో అభ్యంతరకర సీన్ల విషయంలో మాత్రం తనకు అటువంటి అనుభవమే ఎదురైందని తెలిపింది. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకేం తెలిసేది కాదని, అందుకని అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని, అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆ రూట్‌ ను వదిలేశానని పేర్కొంది.

అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని, ఎవరి కోసమో రాజీపడడంలో అర్థం లేదని తెలుసుకున్నానని, ప్రస్తుత స్థాయి తనకు ఆనందంగా ఉందని కాజల్ చెప్పుకొచ్చింది. అంటే పరోక్షంగా కాజల్ ఏం చెప్పిందో అందరికీ అర్ధమైయుంటుంది. అంటే వెండితెరపై చిరునవ్వులు చిందిస్తూ అందాలు ఆరబోస్తున్న ముద్దుగుమ్మల నిజజీవితాలలో ఎంతటి దీనగాధలు ఉన్నాయో ఒక్కొక్కరు నోరు విప్పుతుంటే… అందరూ నోరెళ్ళబెట్టే పరిస్థితులు నెలకొన్నాయి.

ADVERTISEMENT
Latest Stories