‘కాలం’ చేసిన ప్రముఖ నిర్మాత!

Kamakshi Movies producer Siva Prasad Reddy passed awayఅక్కినేని నాగార్జునకు అత్యంత సన్నిహితుడు, ఆ ఫ్యామిలీతోనే ఎక్కువ సినిమాలు చేసిన నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి చెన్నై అపోలో హాస్పిటల్ లో తన ఆఖరి శ్వాసను విడిచారు. గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న శివప్రసాద్ రెడ్డి ఈ రోజు ఉదయం ‘కాలం’ చేసినట్లుగా అధికారిక సమాచారం వెలువడింది.

[m9ad]

ADVERTISEMENT

1985లో ‘కామాక్షి మూవీస్’ బ్యానర్ ను స్థాపించిన శివప్రసాద్, “కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడి, రగడ, దడ” వంటి సినిమాలను నిర్మించారు. శివప్రసాద్ మరణవార్తను విన్న పలువురు సినీ ప్రముఖులు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories