కమల్ పార్టీ పేరుకు అర్ధం?

Kamal-Haasan-Party-----Makkal-Needhi-Maiamఇప్పటివరకు సినిమాలలో ‘యూనివర్సల్ స్టార్’గా వెలుగొందిన కమల్ హాసన్, రాజకీయాల్లోకి వస్తూ తన పార్టీ పేరును “మక్కల్ నీది మైం”గా ప్రకటించారు. అంతర్జాతీయ భాషా దినోత్సవం నాడు ప్రకటించిన ఈ పార్టీ పేరుకు అర్ధం తెలుగులో చెప్పాలంటే… పీపుల్స్ జస్టిస్ పార్టీ (ప్రజలకు న్యాయం చేసే పార్టీ) అన్న మాట. సాధారణంగా డీఎంకే, అన్నాడిఎంకే పేర్లకు విరుద్ధంగా కమల్ పెట్టిన ఈ పార్టీ పేరు సౌండింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంది.

ఇక ‘చేయి చేయి కలుపుతూ’ ఉన్న పతి లోగో ఆకట్టుకునే విధంగా ఉండడమే కాక, ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. మధ్యలో ఎరుపు రంగు ఉండడంతో వామపక్ష భావాలకు దగ్గరగా తన పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని కమల్ చెప్పకనే చెప్పినట్లుగా అర్ధం చేసుకోవాలా! తాను నాయకుడిని కాదు, మీలో ఒకడిని అంటూ భారీ అభిమాన గణం, ప్రజానీకం నడుమ కమల్ అద్వితీయంగా ప్రకటించారు. ఇక పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories