ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చెయ్యడం ఎందుకు?

BJP - Andhra Pradeshఇటీవలే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ ఫలితంతో సందర్భం లేకుండా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. అయితే బీజేపీలోని హరిబాబు వర్గం, సోము వీర్రాజు వర్గం కాస్త దూరంగానే ఉంటున్నాయి. హరిబాబు అయితే మొత్తానికే నిర్లిప్తంగా మారిపోయారు అని పార్టీ వర్గాలే అంటున్నాయి.

హరిబాబు ఇంతకుముందు కేంద్రమంత్రి పదవి ఆశించారు ,అది రాలేదని, ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీచేస్తారా; లేదా అన్న సందేహం కూడా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనితో విశాఖపట్నం పార్లమెంట్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ మరో బలమైన అభ్యర్థి కోసం వెతుకుతుందని సమాచారం.

ADVERTISEMENT

గత ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఆయన భారీ విజయం సాధించారు. అయితే నాలుగు సంవత్సరాలు అయ్యే సరికి ఆయన పార్టీ అధ్యక్ష పదవి పోగొట్టుకుని, ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ కూడా చెయ్యలేని పరిస్థితికి వచ్చేశారు. ఇది చాలా వరకు బీజేపీ స్వయంకృతాపరాధమే.

ADVERTISEMENT
Latest Stories