Kanumuru Raghu Rama Krishna Raju - YS Jaganబాధాకరమైన అంశం ఏమిటంటే… ప్రతి క్రిస్మస్ పండుగకు మా ముఖ్యమంత్రి గారు ఆయన కోరిక మేరకు చక్కగా ఆయన పులివెందుల వెళ్లారు, ఇడుపులపాయ వెళ్లారు. ఆయనకున్న చిన్ని కోరిక మాకూ ఉంటుంది, మా ఊరు వెళ్లాలని, మావుళ్ళమ్మ దేవాలయంలో దండం పెట్టుకోవాలని,భీమేశ్వర ఆలయం వెళ్లాలని, సంక్రాంతి సంబరాల్లో మా వాళ్ళతో కలిసి జరుపుకోవాలని మాకు ఉంటుంది.

పులివెందులలో ఆయన కుటుంబ సభ్యులను ఎలా కలుస్తారో, ప్రార్ధనలు నిర్వహిస్తారో, మాకు మా కుటుంబ సభ్యులను కలవాలని, మా స్వగ్రామంలో తిరగాలన్న ఆకాంక్ష మాకూ ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వెలిబుచ్చారు. పండగకు నేనొస్తున్నాని చెప్పి ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అనేది వారి స్వభావాన్ని తెలియజేస్తుందని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు.

ఇప్పుడే ఢిల్లీ వచ్చానని, న్యాయవాదులతో చర్చించాల్సి ఉందని, తనకున్న న్యాయ పరిజ్ఞానం మేరకు ఏ నోటీసు ఇచ్చిన సెక్షన్స్ ప్రకారం ఇస్తారని, ఇందులో మాత్రం ‘నోటీసు టు అక్క్యూజ్డ్’ అని ఇచ్చారని, ఏ సెక్షన్ లేకుండా నోటీసు ఇవ్వడం అంటే హడావుడిగా రూపొందించడమేనని అన్నారు. ఏపీలో వచ్చాక గుంటూరు వెళ్లాలని అక్కడ ప్రశ్నల తీరు మొదటి రోజు నా పేరు, రెండవ రోజు నా తండ్రి పేరు తెలుసుకునేలా ఉదయం నుండి సాయంత్రం వరకు సాగుతాయని తనదైన శైలిలో చెప్పారు.

నా కాళ్ళు బద్దలు కొట్టారు, నా కాళ్ళు వాచిపోయేలా కొట్టిన తీరును ఉన్మాద చర్యగా తాను మాట్లాడానని, అది సాక్షికి తప్పు అయ్యిందా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాకు జరిగితేనే నేను ప్రశ్నించుకోలేకపోతే, ఒక ఎంపీగా ప్రజలకు అన్యాయం జరిగితే ఎలా ప్రశ్నించగలనని తాజాగా పాల్గొన్న టీవీ5 డిబేట్ లో తన ఆవేదనను వ్యక్తపరిచారు ఆర్ఆర్ఆర్.