మరో వారం రోజుల్లో ప్రేక్షకుల సమ్మోహితులను చేయడానికి సిద్ధమవుతున్న “ఆర్ఆర్ఆర్”కు కరోనా రూపంలో ఢిల్లీ, ముంబై వంటి ప్రదేశాలలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 100 కోట్ల పైబడి రాబడుతుందని అంచనా వేసిన ఢిల్లీలో పూర్తిగా ధియేటర్లను మూసివేయడంతో ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కు నిరాశలో ఉన్నారు.
అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కరణ్ జోహార్ రంగంలోకి దిగారు. సినిమా ధియేటర్లను ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, ధియేటర్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచుతున్నారని, ఇతర బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు బాగా అమలవుతున్నాయని ట్వీట్ చేసారు.
ఈ ట్వీట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు సీఎం కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ‘సినిమాలు సేఫ్’ అనే హ్యాష్ టాగ్ ను వినియోగించారు. బాలీవుడ్ టాప్ దర్శకుడిగా, నిర్మాతగా విశేషమైన పలుకుబడి ఉన్న కరణ్ జోహార్ రంగంలోకి దిగడంతో “ఆర్ఆర్ఆర్” ప్రదర్శనకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతులు ఇస్తుందేమో అన్న టాక్ వినపడుతోంది.
ఒకవేళ అదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు ఎక్కడ లేని ఊరట లభించినట్లే. ‘బాహుబలి’ సినిమాను బాలీవుడ్ నాట ప్రమోట్ చేసిన కరణ్, నాటి నుండి రాజమౌళితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో కూడా కరణ్ పాల్గొన్నారు. మరి రాజమౌళి వేసిన ఈ ప్లానింగ్ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.
ఈ ట్వీట్ లో ఒక్క విషయం గమనించవచ్చు. మన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నట్లు కాకుండా, ట్వీట్ మొదట్లోనే ఢిల్లీ ప్రభుత్వంతో తాము ఏకీభవించడం లేదని స్పష్టంగా చెప్పేసారు. అలాగే ఇతర బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే సినిమా థియేటర్లు సేఫ్ అన్న పాయింట్ ను కూడా నేరుగా చెప్పి, షో ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe
— Karan Johar (@karanjohar) December 30, 2021



