కృష్ణవంశీ హీరోయిన్ పై కేసు నమోదు!

Karnataka police registers case against Sindhu Menonప్రముఖ సినీ హీరోయిన్ సింధు మీనన్ పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్ లో ఆమెతో పాటు ఆమె ముగ్గురు సోదరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి ఆమె 36 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు.

అంతేకాకుండా రుణం కోసం ఆమె సమర్పించిన పత్రాలను కూడా నకిలీవిగా తేలడంతో, బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు… సింధును అరెస్ట్ చేసేందుకు యత్నించినప్పటికీ… ఆమె విదేశాల్లో ఉన్నందున అరెస్ట్ వీలుకాలేదు. దీంతో ఆమె సోదరుడు కార్తికేయన్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణవంశీ ‘చందమామ’ సినిమాలో కాజల్ సోదరిమణిగా నటించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories