ఖైదీతో మహిళా ఎస్సై రొమాన్స్.. విచిత్రంగా ఉందే!

Karnataka Woman SI Suspended Over Viral Video Call

కర్ణాటకలో ఓ మహిళా ఎస్ఐ బెళగావిలోని హిండల్గా సెంట్రల్ జైలులో ఓ ఖైదీతో ప్రేమలో పడింది. ప్రేమ ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలీదు కనుక ఆమె ప్రేమను తప్పు పట్టలేము.

కానీ ఆమె ఆ ఖైదీకి అర్ధ నగ్నంగా యూనిఫారంలో వీడియో కాల్ చేయడమే చర్చనీయాంశమైంది. అతను ఆ వీడియోని తోటి ఖైదీలతో షేర్ చేయగా, అది కాస్త సోషల్ మీడియాలోకి వచ్చేసి వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటక డీజీపీ ఆమెను సస్పెండ్ చేసి శాఖపరమైన విచారణకు ఆదేశించారు.

ADVERTISEMENT

కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆమె, గతంలో హిండల్గా జైలులో పని చేసినప్పుడు ఖైదీగా ఉన్న రౌడీషీటర్‌ సాయి కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య శారీరిక సంబంధం కూడా కొనసాగింది. ఓ ఖైదీతో పోలీస్ అధికారిణి అంత దగ్గరవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎలాగూ అంత దగ్గరయ్యారు కనుక తరచూ వీడియో కాల్స్ చేసి మాట్లాడుకునే వారు. కనుక యూనిఫారంలో అర్ధ నగ్నంగా వీడియో కాల్ చేసేందుకు ఆమె సంకోచించలేదు. ఆ వీడియోను సదరు ఖైదీ రికార్డు చేసి, వైరల్ చేయడంతో షాక్ అయిన ఆమె మరో పెద్ద తప్పు చేసింది.

సాయి కుమార్‌ తనపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ వీడియోను బయటపెట్టాడంటూ ఆమె బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె స్వయంగా ఈ తప్పుని ధ్రువీకరించి, చాటింపు వేసుకున్నట్లయింది. కనుక ఆమెను సస్పెండ్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories