ముసుగు తీసిన కాటమరాయుడు… ఫ్యాన్స్ ఫిదా..!

katamarayudu-pawan-kalyan-latest-new-year-posterగత రెండు, మూడు రోజులుగా కనికనిపించకుండా… చూసి చూపించకుండా… ఉన్నట్లు రిలీజ్ చేస్తున్న “కాటమరాయుడు” స్వరూపం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ముసుగు బంధనాలను తొలగించుకుని ‘కాటమరాయుడు’ అసలు రూపంతో అభిమానుల ముందుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ తో కూడుకున్న వీడియోను రూపొందించిన చిత్ర యూనిట్, సదరు వీడియోతో పాటు ‘కాటమరాయుడు’ గెటప్ లో ఉన్న పవన్ స్టిల్ ను కూడా విడుదల చేసారు. మెడలో పచ్చ తువాలు వేసుకుని మాస్ గెటప్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. తొలిసారిగా ఫుల్ పంచె కట్టుకున్న పాత్రలో పవన్ ఫ్యాన్స్ కు దర్శనమివనున్నాడు. మరి దానిపై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories