పవన్ కళ్యాణ్ “స్పెషాలిటీ” అదేగా!

New Year Wishes From Katamarayudu Teamపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “కాటమరాయుడు” యూనిట్ నుండి కొత్త సంవత్సరం సందర్భంగా ఓ స్పెషల్ వీడియో విడుదల అయ్యింది. ‘కాటమరాయుడు’ యూనిట్ సభ్యులంతా ఒక్కొక్కరిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ విడుదలైన ఈ వీడియోలో పవన్ సోదరులుగా కనిపించే వారు మరియు హీరోయిన్ శృతిహాసన్, దర్శకుడు డాలీతో సహా అందరూ ప్రేక్షకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వీడియోలో భాగస్వామి కాలేదు. చివరగా పవన్ పై చిత్రీకరించిన షాట్స్ ను చూపించినప్పటికీ, పవన్ మాత్రం శుభాకాంక్షలు తెలపలేదు. ఈ ఏడాదే కాదు, ఏ సంవత్సరం కూడా పవన్ ప్రత్యక్షంగా అభిమానులకు గానీ, ప్రేక్షకులకు గానీ ఇలాంటి ప్రత్యేక రోజులను ప్రస్తావించింది లేదు. పుట్టినరోజులు, నూతన సంవత్సర దినోత్సవాలు వంటి ప్రత్యేక రోజులకు పవన్ ప్రాధాన్యత ఇవ్వరన్న విషయం అభిమానులకు తెలిసిన విషయమే కావడంతో, పవన్ షాట్స్ ను చూసి పండగ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories