ఒక వారం ముందుగా… ‘కాటమరాయుడు’ అఫీషియల్ న్యూస్..!

katamarayudu-teaser-trailer-relese-inform-before-1-week‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న “కాటమరాయుడు” సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీపాలు వెలిగిస్తూ ఉన్న శృతిహాసన్, పవన్ కళ్యాణ్ ల లుక్ ఫ్యాన్స్ కు కావల్సినంత కిక్ ను పంచలేదు. దీంతో ‘పవర్ ఫుల్’గా మరో లుక్ ను చిత్ర యూనిట్ నూతన సంవత్సరం కానుకగా సిద్ధం చేస్తోందన్న వార్తలు ఇటీవల హల్చల్ చేసాయి. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ, తాజాగా ఓ అభిమాని మాత్రం నిర్మాత శరత్ మరార్ కు ఓ విజ్ఞప్తితో కూడిన ట్వీట్ చేసారు.

‘కాటమరాయుడు’కు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అయినా… టీజర్ గానీ, ఆడియో గానీ, ట్రైలర్ విడుదల గానీ… ఒక వారం ముందుగా అధికారిక సమాచారం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా శరత్ మరార్ ను కోరారు. దీనికి స్పందించిన మరార్… “మంచి పాయింట్, ఖచ్చితంగా ఒక వారం ముందుగా ప్రకటన చేస్తామని’ తెలిపారు. దీంతో పవర్ స్టార్ అభిమానులకు పూర్తి స్పష్టత వచ్చినట్లయ్యింది. ఇక నుండి ‘కాటమరాయుడు’కు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అయినా ఒక వారం ముందుగానే అభిమానులను పలకరించనుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories