కవితకి క్లీన్ చిట్: ఎన్ని కోణాలో…

Political reactions pour in after Kavitha receives clean chit in Delhi liquor case

కేటీఆర్‌: న్యాయం జరిగింది. కేజ్రీవాల్ ప్రభుత్వం కూలద్రోసేందుకే ఈ తప్పుడు కేసు, అరెస్టులు. ఈ కేసు ప్రభావం ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీపై పడింది.

కవిత: పార్టీ కోసమే జైలుకి వెళ్తే పట్టించుకోలేదు. పార్టీ ఓడిపోతే ఈ కేసు వల్లేనని మీ ఓటమిని నా మెళ్ళో వేస్తారా? మీ అహంకారం వల్లనే బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయింది. నా ఓటమిని నేను ఒప్పుకున్నాను. మీ ఓటమికి అహంకారమే కారణమని మీరూ ధైర్యంగా ఒప్పుకోండి.

ADVERTISEMENT

జగ్గారెడ్డి (కాంగ్రెస్‌): బిజేపి వాళ్ళు ఓ అవసరానికి ఒకలా, మరో అవసరానికి మరోలా వాడుకుంటారు. స్కామ్‌ జరిగిందని చెప్పి కేసు పెట్టింది వాళ్ళే… క్లీన్ చిట్ ఇచ్చింది వాళ్ళే. ఇదో పొలిటికల్ గేమ్‌.

ధర్మపురి అరవింద్ (బిజేపి ఎంపీ): కేసులో సాక్ష్యాలు లేవని చెప్పారు కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. అవి మీడియా పదాలు మాత్రమే. ఆ కేసు ఇక్కడితో ముగిసిపోలేదు. పైకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ చెప్పిందిగా! కవిత లోపల ఉన్నా బయట ఉన్నా మాకు ఫరక్ పడదు. బిజేపికి బీఆర్ఎస్‌కి సంబంధం లేదు. ఈ కేసుకి మా పార్టీకి సంబంధం లేదు. దాని సంగతి సీబీఐ చూసుకుంటుంది.

జాగృతి సభ్యులు: ఈ కేసు పెట్టించడం వెనక బీఆర్ఎస్‌ పార్టీలో వాళ్ళు కూడా ఉన్నారని మాకు అనుమానం.

ADVERTISEMENT
Latest Stories