కవిత హాట్ కామెంట్స్: ఆ కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా…

Kalvakuntla Kavitha during Nerella visit

జాగృతి నుంచి టిఆర్ఎస్ వరకు ఎదిగిన కవిత రాజకీయ ప్రయాణం ఇప్పుడు తన పర్యటనలతో మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. నిత్యం ఏదొక సమస్య పై పోరాడేందుకు రోడ్ల మీదకు వస్తున్న కవిత అటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటుగా గత బిఆర్ఎస్ పాలన పై కూడా విమర్శలు ఎక్కుపెడుతుంది.

తాజాగా నేడు నేరెళ్ల బాధితుల పరమర్శకు వెళ్లిన కవిత రేవంత్ సర్కార్ తో పాటుగా కేసీఆర్ టార్గెట్ గా బాణాలు సంధించారు. కొందరి ధనదాహం తో నేరెళ్ల లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి నేటి వరకు బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వాల నుంచి అందకపోవడం బాధాకరం అంటూ మొదలుపెట్టారు కవిత.

ADVERTISEMENT

ఈ సందర్భంగా నాడు పాలించిన ఆ కుటుంబంలో నేను కూడా ఉన్నందుకు సిగ్గుతో తలతించుకుంటు క్షమాపణలు చెపుతున్నా అంటూ కవిత చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ లో హాట్ టాపిక్ కాబోతున్నాయి. ఆ కుటుంబంలో ఉన్నందుకు అంటూ కవిత చేసిన ఈ కామెంట్స్ పై ఆ కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబమా.? లేదా బిఆర్ఎస్ కుటుంబమా.? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.

తండ్రి కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీ తో ‘కల్వకుంట్ల’ కవితగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కవిత ఇప్పుడు అదే తండ్రి బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ రక్షణ సేన’ అంటూ మరో తెరాస ను స్థాపించినప్పటికీ ఇప్పటికి కవిత రాజకీయం కల్వకుంట్ల కవితగానే సాగుతుంది.

మరి అటువంటి సందర్భంలో కవిత ఆ కుటుంబం లో ఉండడం సిగ్గు చేటు అంటూ చేసిన కామెంట్స్ కేసీఆర్ కుటుంబానికి కాకుండా బిఆర్ఎస్ కుటుంబానికి వర్తిస్తాయా.? అయితే తన కు ఎంపీగా, ఎమ్మెల్యే గా పదేళ్లు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ పై కవిత ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమర్థనీయం అనేది కవితనే గ్రహించాలి అంటున్నారు బిఆర్ఎస్ శ్రేణులు.

పదేళ్ల బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కవిత కూడా అదే పార్టీలో ఉన్నారు, ఎంపీగా ఎమ్మెల్సీ గా పదవులు అనుభవించారు. అయితే నాడు మౌనంగా ఉండి నేడు తప్పు జరిగింది క్షమాపణలు అంటే బాధితులకు న్యాయం జరుగుతుందా.? కవిత పొలిటికల్ కామెంట్స్ గమనిస్తే కవిత రాజకీయం ప్రత్యక్షంగా బిఆర్ఎస్ టార్గెట్ గా సాగుతుందా.? లేదా పరోక్షంగా కేసీఆర్ ని గురిపెడుతున్నాయా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories