‘కేసీఆర్’ కాస్త ‘కారు డ్రైవర్’గా ఎలా మారారు?

KCR About Chinna Jeeyar Swamyతెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కారు డ్రైవర్ గా మారడమేంటి? ఎంత పార్టీ గుర్తు కారు అయితే మాత్రం ‘డ్రైవర్’గా ఎలా మారతారు అన్న సందేహం వలదు. ఎందుకంటే దీనికి సంబంధించిన ‘ఫ్లాష్ బ్యాక్’ను స్వయంగా కేసీఆర్ గారే సెలవిచ్చారు. హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో జరిగిన చినజీయర్ స్వామి షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తనకున్న అనుబంధాన్ని ఒకసారి నెమరువేసుకున్నారు. ఆయన మాటల్లోనే…

22 సంవత్సరాల క్రితం సిద్దిపేటలోని వికాస తరంగిణి కార్యకర్తలు… అక్కడ ఉన్న ఆధ్మాత్మిక సంపన్నులు నా దగ్గరకు వచ్చారు. మన పట్టణాన్ని అనుగ్రహించడానికి చిన్నజీయర్ స్వామి వారు వేంచేయడానికి అంగీకరించారని, బ్రహ్మయజ్ఞం నిర్వహించడానికి ఎమ్మెల్యేగా నా సహకారం కావాలని వారు నా దగ్గరకు వచ్చారు. “వారి రాక సిద్దిపేటకు శారద రాక” అని, తన సంపూర్ణ సహకారముంటుందని వికాసతరంగిణి వారికి చెప్పాను. స్వామి వారు ఇక్కడికి వస్తే, ఎవరి ఇంట్లో ఉండాలనే విషయమై అందరూ ఆలోచించగా, చివరకు మా ఇంట్లోనే స్వామి వారు ఉన్నారని, వారం రోజుల పాటు ఉండే అదృష్టాన్ని స్వామి వారు నాకు కల్పించారని అన్నారు.

ADVERTISEMENT

అయితే, స్వామి వారిని సిద్దిపేటలోకి ఆహ్వానించగానే, ఆయనకు నేనొక ప్రార్థన చేసుకున్నాను. మీరు సిద్దిపేటలో ఉన్నన్ని రోజులూ “నా కారే తమరి వాహనం… నేనే మీ డ్రైవర్ ని… ఆ అవకాశం నాకు ఇవ్వాలి” అని స్వామి వారిని కోరగా, వారు దయతో అంగీకరించారని తెలిపారు. సిద్దిపేటలో ఉంటూ పరిసర ప్రాంతాల ఆలయాలకు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆ సమయంలో స్వయంగా నేను కారు డ్రైవ్ చేస్తూ, కలిసి వెళ్లే వాళ్లమని సీఎం కేసీఆర్ నాటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అలా తను డ్రైవర్ గా మారిన క్షణాలను నేమరువేసుకుని అతిధులకు, ప్రజలకు మంచి అనుభుతూలను మిగిల్చారు.

ADVERTISEMENT
Latest Stories