ఏపీ పోలీసులు తెలంగాణలో డబ్బులు పంచుతున్నారట… మరి కేసు పెట్టారా?

KCR Allegations on Andhra Pradesh Police distributing moneyతెలంగాణలో అరాచకం సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఆపద్ధర్మ మంత్రి కెసిఆర్ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంచేందుకు చంద్రబాబు తెరతీశారన్నారు. ధర్మపురిలో తమ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. కొందరు డబ్బులతో దొరికారని, తీరా వారు ఏపీ పోలీసులని తెలిసిందని స్పష్టం చేశారు.

[m9ad]

ADVERTISEMENT

ఏపీ పోలీసులు తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం ఏపీ ఇంటలిజెన్స్‌ను చంద్రబాబు ఉపయోగిస్తున్నారని ఇప్పటికే తెరాస నాయకులు ఆరోపించారు. ఆ క్రమంలోనే ఈ కొత్త ఆరోపణలు చేసినట్టుగా కనపడుతుంది.

అయితే తెరాస నాయకులు ప్రచారం చేస్తుంటే అక్కడ ఏపీ పోలీసులుగానీ మహాకూటమి నాయకులుగానీ ఎందుకు డబ్బులు పంచుతారు? టీడీపీకి ఓటు వెయ్యాలని వారు ప్రచారం చేస్తున్నారని తెరాస నాయకుల ఆరోపణ. ఇదే సందర్భంలో తమ పార్టీ నాయకులు ఏపీ పోలీసులను గానీ వేరొకరినిగానీ చిత్తక్కోడితే తమకు సంబంధం లేదని కూడా కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇంతకు వారిని అరెస్టు చేసి కేసు ఏమైనా నమోదు చేసారా?

ADVERTISEMENT
Latest Stories