తెలంగాణాలో ఎన్నికల హడావిడి ముందుగానే వచ్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల ముందే ప్రజాతీర్పు కోరడానికి ఆరాటపడుతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్దు కావచ్చని వార్తలు సూచిస్తున్నాయి.ముహూర్తాలను బాగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో తేదీ ఏకాదశి కూడా కావడంతో ఆ రోజున అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చన్నది కధనం.
[m9ad]
జాతకరీత్యా, రాజకీయ రీత్యా అన్ని లెక్కలూ సరిచూసుకునే ఈ ముహూర్తం నిర్ణయించినట్లు చెబుతున్నారు. అలాగే ఆరు అనేది కేసీఆర్ అదృష్ట సంఖ్య కూడా. దానికి ముందుగా కేసీఆర్ ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ తో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఇరు పక్షాలు కలిసి పనిచేస్తున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ముందస్తు ఎన్నికల విషయంలో తమకు సహకరిస్తే పార్లమెంట్ ఎన్నికలలో తాము సహకరిస్తామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారంట. మరోవైపు సెప్టెంబర్ 2వ తేదీన కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఇబ్రహ్మిపట్నంలో జరగబోతున్న ఈ సభకు గతంలో ఎన్నడూ లేనట్టుగా 25 లక్షల జనసమీకరణ చెయ్యబోతున్నారు.



