టీడీపీ మీద కుట్రతో, బాబు మీద ఉన్న అసూయతో ‘శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు’ అనే సామెత మాదిరి కేసీఆర్, జగన్ ఒక్కటయ్యారు, లాభపడ్డారు. 2019 ఏపీ ఎన్నికల సమయం నాటి నుంచి అజ్ఞాత మిత్రులుగా కొనసాగిన వీరి బంధం ఓసారి అధికారంతో లాభపడితే మరోసారి ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2023 తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి, 2024 ఏపీలో వైసీపీ పతనం రెండు కూడా టీడీపీ బలాన్ని చూపించాయి. బిఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ఒక్కసారిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయి అటు పార్టీని ఇటు ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో శేష జీవితం గడుపుతున్నారు.
Also Read – చంద్రబాబు ఒక్క పర్యటనతో ఏపీకి ఇన్ని ప్రయోజనాలు!
అయితే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆ పార్టీ గొంతు బలంగా వినిపించడానికి, ప్రభుత్వంతో పోరాడడానికి కేసీఆర్ కు మేనల్లుడు రూపంలో హరీష్ రావు, కొడుకు రూపంలో కేటీఆర్ ఇద్దరు నేతలు అందుబాటులో ఉన్నారు.
గత ఆరు నెలలుగా తెలంగాణలో కేసీఆర్ జాడ లేకుండానే బిఆర్ఎస్ ప్రస్తావన కొనసాగుతూ వస్తుంది. అటు ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతూనే, ఇటు పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు హరీష్, కేటీఆర్.
Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!
అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత విషయంలో కూడా వీరిద్దరే చొరవ చూపించి పార్టీతో పాటు కేసీఆర్ కు కొండంత అండగా నిలబడ్డారు.
అయితే కేసీఆర్ కు ఈ ఇద్దరు మాదిరి జగన్ కు ఉన్న బలమేమిటి అంటే.? ఈ ప్రశ్నకు వైసీపీ నేతలే కాదు జగన్ కూడా సమాధానం చెప్పలేరేమో. గతంలో జగన్ తన అక్రమాస్తుల కేసు విషయంలో అరెస్టయ్యి 16 నెలలు జైలుకు పరిమితమైన నేపథ్యంలో వైసీపీ బాధ్యతలు భుజానకెత్తుకున్నారు ఆయన సోదరి వైస్ షర్మిల.
Also Read – చిరంజీవికి గంజి పెట్టి ఇస్త్రీ చేయక తప్పదట!
కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. అన్నా చెల్లెళ్ళ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గున మండిపోయేలా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అనుకోని కారణాల రీత్యా లండన్ పర్యటన కావచ్చు, బైలు రద్దు కావచ్చు, లేదా కొత్త కేసులు మెడకు చుట్టుకోవచ్చు. ఇలా కారణం ఏదైనా కావచ్చు.
అటువంటి సందర్భంలో జగన్ క్షేత్ర స్థాయి లో ప్రజలకు అందుబాటులో లేకపోతె ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు.? తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి స్వయానా జగనే తప్పించారు. అలాగే చెల్లి షర్మిలను తన స్వీయ తప్పిదాల వల్ల దూరం చేసుకున్నారు.
ఇక జగన్ కు తోడుగా వైసీపీ ని కాపుకాసే ఆ పెదకాపు ఎవరు.? జగన్ సతీమణి భారతి రెడ్డి కావచ్చు. కానీ భారతి కి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల అనుభవం లేదు. అయితే బాబు అరెస్టు సమయంలో నిజం గెలవాలి అంటూ నారా భువనేశ్వరి కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసారు.
అయితే ఆ సమయంలో భువనేశ్వరికి తోడుగా లోకేష్ పార్టీ శ్రేణులకు అందుబాటులోనే ఉన్నారు. అంతే కాకుండా బాబు తరువాత స్థానంలో అప్పటికే లోకేష్ పార్టీలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. భువనేశ్వరికి లోకేష్ మాదిరి భారతికి ఎవరు నడగా నిలబడతారు.? ఆ స్థాయిలో పార్టీలో జగన్ తరువాత స్థానం ఎవరు అన్నది ఏప్పటికి వైసీపీలో ఓ ప్రశ్నగానే మిగిలిపోతుంది.