సారు ద్రవిడ పార్టీలు ఆదర్శం అన్నారుగా?

Chandrababu Naidu’s political strategies and leadership style become a topic of discussion in Andhra Pradesh politics

కేసీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా తమిళనాడులో ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేల విధానాలు, వాటి పని తీరు, పార్టీ-ప్రభుత్వం సంబంధాలపై లోతుగా అధ్యయనం చేయాలని చెపుతుండేవారు. ఆ రెండు పార్టీలు రాజకీయాలలో అన్ని ఆటుపోట్లు తట్టుకొని దశాబ్దాలుగా నిలద్రొక్కుకొని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తుండటమే కేసీఆర్‌ ఆసక్తికి కారణం. కానీ తాజా ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కొత్తగా రాజకీయాలలో అడుగు పెట్టిన విజయ్‌ చేతిలో ఓడిపోయాయి! ఇప్పుడూ ఆ రెండు పార్టీలే ఆదర్శమనగాలరా?

అయితే కేసీఆర్‌కి రాజకీయ అక్షరాభ్యాసం చేయించిన గురువు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వద్ద ఏమీ నేర్చుకోకపోవడం విశేషం. అందుకు అహం అడ్డొవచ్చింది. గురువు దగ్గర నేర్చుకోకపోతే పోయే… గురువుకే ఎసరు పెట్టి గద్దె దించేశారు.

ADVERTISEMENT

అందుకు గురువు గారు ‘చాలా ఖరీదైన రిటర్న్ గిఫ్ట్’ ఇస్తే మౌనంగా పుచ్చుకున్నారు. కనీసం థాంక్స్ కూడా చెప్పలేని పరిస్థితి.

కానీ చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపిని ఏవిధంగా నడిపించారు?జగన్‌ దాష్టికాలను ఏవిధంగా ఎదుర్కొన్నారు?నారా లోకేష్‌ వంటి యువ నాయకులను ఎలా తయారు చేసుకున్నారు?

ఇగో పక్కనపెట్టి, ఆక్షేపణలు పట్టించుకోకుండా విజ్ఞతతో ఏవిధంగా పొత్తులు కుదుర్చుకున్నారు?పొత్తులతో తాను గెలిచి తనతో ఉన్నవారందరినీ ఏవిధంగా గెలిపించుకున్నారు?

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములను ఏవిధంగా గౌరవిస్తున్నారు? ఏవిధంగా అందరినీ కలుపుకుపోగలుగుతున్నారు? కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి ఏవిధంగా లబ్ది కలిగిస్తున్నారు?

సిఎం హోదాలో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలతో ఏవిధంగా మమేకం అవుతున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల నేతలను కూడా ప్రజలతో మమేకం అయ్యేలా చేస్తూ ఏం సాధించబోతున్నారు?

ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా లేదా? పక్కలో బల్లెంలా మారిన ప్రతిపక్షాన్ని ఏవిధంగా ‘హ్యాండిల్’ చేస్తున్నారు? వంటి అనేక అంశాలపై ఆయన శత్రువులు కూడా అధ్యయనం చేసి అనేక రాజకీయ పాఠాలు నేర్చుకోవచ్చు.

నేర్చుకొని.. ఇంకా నేర్చుకుంటున్న… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ డెప్యూటీ సిఎం అయ్యారు. నారా లోకేష్‌ సరేసరి.. ప్రధాని మోడీతో పలువురు కేంద్ర మంత్రులు ప్రశంశలు పొందుతున్నారు.

కానీ కేవలం ఇగో, వ్యక్తిగత, రాజకీయ ద్వేషం కారణంగా నేర్చుకోవడానికి ఇష్టం లేని కేసీఆర్‌, జగన్‌ వంటి వారు, వీటినే చంద్రబాబు నాయుడి బలహీనతలుగా అభివర్ణిస్తూ ‘తాము ఒంటరిగా మిగిలిపోవడమే చాలా గొప్ప’ అన్నట్లు చెప్పుకొని జబ్బలు చరుచుకుంటున్నారు.

కానీ రాజకీయాలతో సహా ఏ రంగంలోనైనా శత్రువుల వద్ద కూడా పాఠాలు నేర్చుకునేవారే రాణించగలరు. లేకుంటే వారి అహంకారమే వారిని సర్వనాశనం చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories