kcr-chandrababu-naidu-jagan-pawan-kalyan

ప్రతీ రాజకీయ పార్టీకి, వాటి నాయకులకు జయాపజయాలు తప్పవు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి చూపించి, రాజకీయాలను కంటి చూపుతో శాశించిన కేసీఆర్‌ పతనం ఎవరూ ఊహించనిదే.

Also Read – జగన్‌ ధోరణి… వైసీపి దౌర్భాగ్యం

శాసనసభ ఎన్నికలలో ఆయన బొటాబోటీ మెజార్టీతో అయినా మళ్ళీ అధికారంలోకి వస్తారనుకుంటే ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో కనీసం 2-3 సీట్లు గెలుచుకుంటారంటే ఒక్కటీ గెలుచుకోలేకపోయారు. కేంద్రంలో చక్రం తిప్పుదామనుకుంటే కనీసం కూతురు కవితని జైలు నుంచి విడిపించుకోలేకపోతున్నారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనుకుంటే, అనేక కేసులు ఆయన మెడకు చుట్టుకుంటుండటంతో ఆ భయంతో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఆయనను విడిచి పారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Also Read – అప్పుడు వద్దనుకున్న రాజ్యాంగమే అవసరం పడిందిప్పుడు

విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్ ఆయనకు రేపటిలోగా తమ ఎదుట హాజరయ్యి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.

మరో పక్క ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ కూడా విచారణ జరుపుతోంది.

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

వాటికి సమాంతరంగా ఫోన్ ట్యాపింగ్‌ కేసు, గొర్రెల కొనుగోలు కుంభకోణం కేసుల విచారణ సాగుతోంది. అన్ని కేసులలో విచారణ ఎదుర్కుంటున్న అధికారులు కేసీఆర్‌ ఆదేశం మేరకే ఇవన్నీ జరిగాయని చెపుతున్నారు. కేసీఆర్‌ అనుమతి లేనిదే తెలంగాణలో ఏది జరిగేది కాదు. కనుక ఈ తప్పులు లేదా నేరాలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలన్నిటికీ ఆయన బాధ్యత వహించక తప్పకపోవచ్చు. ఒక్క ఎన్నికలో ఓడిపోగానే కేసీఆర్‌ పరిస్థితి ఇంత దయనీయంగా మారడం ఆశ్చర్యకరమే.

కేసీఆర్‌ ఎంత నిరంకుశంగా, నోటి దురుసుతో అహంకారంగా వ్యవహరించినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపారు. అనేక చక్కటి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేశారు. కనుక ఆయన ఓటమి, ఈ పతనం రెండూ ఊహించనివే.

అదే… ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి 5 ఏళ్ళ పాలన ఏవిదంగా సాగిందో అందరూ కళ్ళారా చూశారు కనుక ఆయన ఓటమి ఆయనకు తప్ప మరెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఓటమి తర్వాత ‘పతనం’ అనే మరో దశ కూడా ఉంది. అది ఏవిదంగా ఉండబోతోందో… ఎంతకాలంలో జరుగబోతోందో తెలీదు కానీ బహుశః వైసీపి-జగన్‌ పతనం కూడా ఎవరికీ ఆశ్చర్యం కలిగించకపోవచ్చు.

జగన్‌ 5 ఏళ్ళుగా తన విజయానికి సన్నాహాలు చేసుకున్నారే కానీ దాదాపు ఏడాదిగా కనిపిస్తున్న స్పష్టమైన ఈ సంకేతాలని జగన్‌ చూడదలచుకోకపోవడం వైసీపి పాలిట శాపంగా మారింది. చివరికి ఇంత దారుణంగా వైసీపి ఓడిపోయింది.

ఇంచుమించు ఒకే రకమైన మైండ్ సెట్స్‌ కలిగి రెండు పూర్తి భిన్నమైన విధానాలతో ముందుకు సాగి కేసీఆర్‌, జగన్‌ దెబ్బ తినగా, జగన్‌కు లేని ‘పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్ సెట్’ గుణాలను తనకు తాను ఆపాదించుకుని భ్రమలో ఉండిపోగా అదే ‘పాజిటివ్ మైండ్ సెట్స్‌’తో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ కలిసి ఘన విజయం సాధించారు.