పరీక్షలలో విద్యార్దులు కాపీలు కొట్టడం, కార్బన్ కాపీ చేయడం అందరికీ తెలుసు. అదేవిదంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు కూడా మక్కికి మక్కీ కాపీ కొట్టిన్నట్లు సాగుతుండటమే చాలా విడ్డూరంగా ఉంది.
మరో విదంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఓ వార్తలో రాష్ట్రం, పార్టీ, నాయకుడు పేరు మార్చి చదువుకుంటే చాలు అది మరో రాష్ట్రానికి సంబందించిన వార్తగానే కనిపిస్తుంది.
Also Read – అయ్యో పాపం… వాలంటీర్లు!
ఉదాహరణకు “చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.”
ఇదే వార్తని తెలంగాణలో చదువుకోవాలనుకుంటే “రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చలేక తమపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.”
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కించేశారా?
ఇలా పొరుగు రాష్ట్రంలో ఏ రాజకీయ వార్తనైనా మన రాష్ట్రానికి అన్వయించుకొని చదువుకుంటే, అది అచ్చంగా మన రాష్ట్రంలో జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటి విచిత్రం ఎప్పుడో కానీ జరుగదు.
ఒకే భావజాలం కలిగిన కేసీఆర్, జగన్ ఒకేసారి అధికారం కోల్పోవడం, వారిద్దరి ఉమ్మడి శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు అవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
Also Read – ఇంతకీ షర్మిల బాణం గురి ఎవరివైపు?
అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలను కాపీలు కొట్టుకొని అమలుచేయడం పెద్ద విశేషమేమీ కాదు కానీ రెండు పార్టీలు, వాటి అధినేతలు దాదాపు ఒకేలా రాజకీయాలు చేస్తుండటమే విచిత్రంగా ఉంటుంది.
కేసీఆర్, జగన్ ఇద్దరూ నెల రోజులలోనే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని తీర్పు చెప్పేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితం కాగా జగన్ ప్యాలస్ గడప దాటడం లేదు.
కేసీఆర్, జగన్ ఇద్దరి భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంది. కానీ ఇద్దరూ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్పుకుంటున్నారు.
బిఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో మకాం వేసి బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తుంటే, వైసీపి తరపున విజయసాయి రెడ్డి చేస్తున్నారు. ఒక పార్టీ కల్వకుంట్ల కవిత విముక్తి కోసం, మరో పార్టీ తమ కేసుల నుంచి ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నాయి.
రెండు పార్టీలు కూడా తమ రాజ్యసభ సభ్యులను బీజేపీకి తాకట్టు పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
తెర వెనక అవి చేస్తున్న ప్రయత్నాల వలననో ఏమో ఏపీ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణ బీజేపీ కేసీఆర్‌ని పల్లెత్తుమాట అనడం లేదు. అలాగే వారు కూడా బీజేపీ జోలికి వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను మాత్రమే టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.
కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలు దాదాపు ఒకేవిదంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. కానీ వాటి పరిణామాలు, పర్యవసానాలు కూడా ఒకేలా ఉంటాయా లేదా? అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు.