ఇన్నాళ్ళుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలు నడుపుతున్నారు అంటూ ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే కేసీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా రాజకీయం నడిపిస్తుంది.
నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాల భూమి అంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు, ఆయన భూముల పై అధికారుల విచారణ అంటూ చేసిన ప్రకటనలు తెలంగాణ రాజకీయాలలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి.
కేసీఆర్ భూముల వ్యవహారం పై 30 రోజులలో విచారణ పూర్తి చేసి తనకు నివేదిక ఇవ్వాలని, లేని పక్షంలో అధికారుల పై చర్యలు తప్పవంటూ రేవంత్ ఇచ్చిన హెచ్చరికలతో క్షేత్ర స్థాయిలోకి దిగారు అధికారులు. నేడు ఎర్రవల్లితో పాటుగా శివారు వెంకటపూర్, వరదరాజపూర్ గ్రామలలో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలను వెళ్లారు.
సర్వే నెంబర్ 325 లోని అసైన్డ్ భూముల ఫై అధికారులు ఫోకస్ పెట్టారు. ఒకపక్క రేవంత్ ఆదేశాలు ఇలా క్షేత్ర స్థాయిలో పరిశీలను రాగ, మరోపక్క బిఆర్ఎస్ నేతలు రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. కేసీఆర్ తనయుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకొచ్చి కేసీఆర్ భూముల విషయంలో రేవంత్ చేసిన ఆరోపణలను ఖండించారు.
కేసీఆర్ పుట్టుకతోనే శ్రీమంతుడు అంటూ పేర్కొనగా, అందుకు మంత్రి పొంగులేటి 2004 కేసీఆర్ ఎన్నికల అఫడవిట్ లో కనిపించని ఈ భూముల లెక్కలు ఇప్పుడెలా పుట్టుకొచ్చాయని, అయితే నాడు కేసీఆర్ తన ఎన్నికల అఫడవిట్ లో చూపించిన లెక్కలు అసత్యాలా.? లేదా ఇప్పుడు రికార్డు లో కల్వకుంట్ల పేరు మీద కనిపిస్తున్న భూములు అక్రమాల అంటూ తన X వేదికగా కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలు ఇప్పటికి ఆర్థిక కష్టాలలో కొట్టుమొట్టాడుతుంటే ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్, అతని కుటుంబానికి మాత్రం వేల కోట్ల ఆస్తులతో వందల ఎకరాల భూములను కూడకట్టారంటూ ఆరోపించారు.
We’ve seen the father’s land scams. Now, let’s see the Drama Rao @KTRBRS edition.
In 2009, KTR had just one acre. Now, he has a land empire of hundreds of acres.
For years, KTR boasted about his “American success” and claimed he had owned hundreds of acres since childhood.… https://t.co/7cVXlLxbXq pic.twitter.com/N8eQeCcx7s
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 17, 2026





