KCR, Prashant Kishor, Telanganaతెలంగాణ రాజకీయాల్లో ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ ల పేర్లు మార్మోగి పోతున్నాయి. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల కు చెందిన ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరూ ఇప్పుడు కేసీఆర్ రాజకీయాలకు దిక్సూచి గా మారారు. అయితే ఈ ఇద్ద‌రూ క‌లిసి కేసీఆర్ వ్యూహాల‌ను ముందుకు తీసుకెళ్లే విధంగా టీఆర్ ఎస్ టీమ్ ప్లాన్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచేందుకు, అలాగే జాతీయ రాజ‌కీయాల్లో త‌న ప్ర‌భావాన్ని చూపేందుకు ఈ ఇద్ద‌రి సాయం గులాబీ బాస్ తీసుకుంటున్నారు.

ఇప్ప‌టికే రెండు సార్లు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ సెంటిమెంట్ త‌న‌ను గ‌ట్టెక్కించ‌లేద‌ని గ్ర‌హించారు. అందుకే ఈ సారి పీకే వ్యూహాల‌ను న‌మ్ముకుంటున్నారు. దాంతో పాటు జాతీయ రాజ‌కీయాల్లో అడుగులు వేసేందుకు ప్ర‌కాశ్ రాజ్‌ను త‌న స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉప‌యోగించుకుంటున్నారు. కాగా వీరు ముగ్గురు మొన్న కేసీఆర్ ఫామ్ హౌజ్ లో భేటీ అయ్యారు.

Also Read – బాలినేని చెప్పబోయే ఆ గండికోట రహస్యాలు ఏమిటో?

ఈ భేటీలో ప్ర‌శాంత్ కిషోర్ తో రూ.500కోట్ల ఒప్పందాన్ని కేసీఆర్ కుదుర్చుకున్నారని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ ఇదే విష‌యాన్ని ఉటంకిస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌శాంత్ కిషోర్ లు క‌లిసి ఎంత ప్ర‌య‌త్నించినా.. కేసీఆర్ ఓడిపోతారంటూ జోస్యం చెబుతున్నారు.

ప్ర‌శాంత్ కిషోర్ గ‌తంలో అనేక పార్టీల‌కు వ్యూహ క‌ర్త‌గా ప‌నిచేశారు. ఇందులో ఎక్కువ‌గా ఆయ‌న స‌క్సెస్ సాధించారు. పైగా బీజేపీని ఎదుర్కుని బెంగాల్ లో మ‌మ‌త‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఆ న‌మ్మ‌కంతోనే కేసీఆర్ ఇప్పుడు పీకే సాయం కోరారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అలా ఉంచితే.. ఇప్పుడు టీకాంగ్రెస్ పీకేను తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.

Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!


ఎవ‌రెన్ని చెప్పినా పీకే ఇప్ప‌టికే త‌న ప‌ని స్టార్ట్ చేశారు. కేసీఆర్ త‌ర‌ఫున రంగంలోకి దిగిపోయారు. అయితే ప్ర‌కాశ్ రాజ్ ఎందుకు కేసీఆర్ కు మ‌ద్ద‌తుగా వ‌స్తున్నారో అర్థం కావ‌ట్లేదు. శ్ర‌వ‌ణ్ మాత్రం ప్ర‌కాశ్ రాజ్ మంచి లీడ‌ర్ అంటూ కితాబు ఇస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేరు. పైగా బీజేపీ వ్య‌తిరేకి. ప్ర‌కాశ్‌రాజ్‌కు ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఏమైనా కేసీఆర్ కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌చ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ ముగ్గురి మ‌ధ్య‌లో ఒప్పందం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు మాత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి.