కేసీఆర్ మోనం దేనికి సంకేతం..? బాధా…భయమా..?

BRS KCR

రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా దేశవ్యాప్త ప్రచారం పొందిన కేసీఆర్ మళ్ళీ చాలాకాలం తరువాత జాతీయ వార్తలలోకెక్కారు. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో ఢిల్లీ పునాదులు కదిపిన వీరుడిగా చరిత్రకెక్కితే ఇప్పుడు కూతురు కవిత పై వచ్చిన లిక్కర్ స్కాం ఆరోపణలతో కేసీఆర్ పేరు ఢిల్లీ వీధులలో మరోసారి మారుమోగుతోంది.

ADVERTISEMENT

అయితే ఉద్యమ సమయం నుండి ఎంతో ఎగ్రెసివ్ గా ప్రత్యర్థి పార్టీల మీద ఆయా పార్టీల నేతల మీద దూకుడుగా విమర్శలు చేసే కేసీఆర్ ఇప్పుడు స్వయాన కూతురు అరెస్ట్ పైన కూడా ఎటువంటి స్పందన చూపకుండా మోనంగా ఉండడం ఆయన దీనస్తితికి అద్దం పడుతుంది.

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోను కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాని మంత్రి మోడీ పైన విరుచుకుపడిపోయిన కేసీఆర్ ఇప్పుడు కవిత పై ఈడీ పెట్టిన కేసుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడక రావడం విస్మయానికి గురి చేస్తుంది. అటు పార్టీ నేతలు కవిత రెస్టులో బీజేపీ హస్తం ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం మోన ముద్రలోనే మునిగితేలుతున్నారు.

ఇన్నాళ్లు మోడీనా..? కేడినా..? ఈడినా..? అంటూ రెచ్చిపోయిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఎం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులను లాగేసుకుంటా…ఈ పార్టీలను కలిపేసుకుంటా…పక్క రాష్ట్ర రాజకీయాలలో తలదూర్చేస్తా, దేశ రాజకీయాలను శాసించేస్థా అంటూ ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సంఘటనలను కూడా ఎదుర్కోలేకపోతున్నారు అనే అపవాదును మూటకట్టుకుంటున్నారు.

గతంలో తన పార్టీ పైన కానీ తన కుటుంబం పైన కానీ ఏ ఒక్క విమర్శ చేసినా సహించలేని కేసీఆర్ తన మాటలతో ప్రత్యర్థిని చీల్చి చెండాడేవారు. కానీ ఇప్పుడు సొంత కూతురు లిక్కర్ స్కాం లో అడ్డంగా దొరికిపోయింది….కేసీఆర్ పాలనలో తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తాం అంటూ హామీలిచ్చి కేసీఆర్ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారు అంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీల నేతలు ఎన్ని విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నా మోనమే తన సమాధానం అన్నట్టు కేసీఆర్ వ్యవహరించడంతో కేసీఆర్ ది బాధా..? భయమా..? అంటూ సర్వత్రా చర్చ జరుగుతుంది.

గతంలో రేవంత్ అరెస్టు విషయంలో కూడా కేసీఆర్ ఇదే తరహా ఒంటెద్దు పోకడలకు పోయిన విషయాన్ని, మొన్న ఏపీలో బాబు అరెస్టు నేపథ్యంలో కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాక్యలను గుర్తు చేసుకుంటున్న రేవంత్, బాబు అభిమానులు మాత్రం కేసీఆర్ కు దేవుడు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు…ఖర్మ విల్ కమ్…అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కవిత ఇంట్లో సోదాలు, అరెస్టు, రిమాండ్, విచారణ అంటూ ఈడీ అధికారులు ఒకపక్క చెకచెకా పావులు కడుపుతూనే మరోపక్క ఆమె భర్త అనిల్ కు కూడా విచారణకు హాజరుకావాలంటూ నోటీసిలు ఇష్యూ చేసారు. ఇలా ఈడీ అధికారులు కవిత కేసును పరుగులు పెట్టిస్తుంటే…ఇటు తెలంగాణలో పారల్మెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడిపోతుంది.

ఉన్న అభ్యర్థులను కాపాడుకోలేక, పార్టీ వీడుతున్న వారిని నివారించలేక, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక సతమతమవుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కవిత కేసు మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇలా సమస్యలన్నీ ఒక్కసారే చుట్టుముట్టడంతో కేసీఆర్ కు ఏమిచేయాలో పాలిపోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పరిమితికి మించి రాజకీయ నాయకులతో ‘కారు’ నింపిన కేసీఆర్ ఇప్పుడు అదే స్థాయిలో ‘కారు’ కాలికావడం చూస్తున్నారు.

అలాగే తన పార్టీ ఎదో అక్షయ పాత్ర అన్నట్టుగా భావించి ఇక రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలి అని అనుకున్న కేసీఆర్ కు దక్కిందేంటి..? ఆపార్టీకి మిగిలిందేంటి..? అంటే కేసీఆర్ కు కనీసం ప్రతిపక్ష నేత అనే హోదా అయినా మిగిలితే తెరాస కు ఆ గుర్తింపు కూడా మిగలలేదు. పార్టీ పేరు మార్పుతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదాం అని ఆశించిన కేసీఆర్ చివరికి స్కాములు స్కాములు అంటూ జాతీయ వార్తలలో తేలారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్నది కవితే అయినప్పటికీ కవిత కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా కవిత పేరు కన్నా అక్కడ కేసీఆర్ పేరే హైలైట్ అవుతుంది. అధికారం అనే అహంకారం నెత్తికెక్కితే దాని తాలూకా ఫలితాలు కూడా ఇలానే కఠినంగా ఉంటాయని…ఇప్పుడు కేసీఆర్ కు తెలిసి వచ్చినట్లే త్వరలో ఏపీ రాజకీయాలలోని కొందరు వైకాపా నాయకులకు కూడా తప్పక తెలివస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories